అది ఒకే కానీ పెళ్లి పై ఆసక్తి లేదంటున్న ఇలియానా..!?

Anilkumar
గోవా బ్యూటీ ఇలియానా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోల సరసన నటించి స్టార్ట్ డంను సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా ఇలియానా సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె ఇచ్చిన రీ ఎంట్రీ ఇచ్చిన అది అంతగా ఆమెకి కలిసి రాలేకపోయింది. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఇలియానా పెళ్లి పై ఇప్పటికే ఎన్నో రకాల పుకార్లు రావడం జరిగింది. మరోవైపు తన ప్రేమ కథలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచిన వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు ఇలియానా. పైగా పెళ్లి గురించి ఇలియానా ఒకింత వ్యంగంగా స్పందించింది.

 ఇక ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఇలియానా కత్రినా కైఫ్ సోదరిడితో చట్టపట్టలేసుకొని తిరుగుతుంది. ఇలాంటి తరుణంలో పెళ్లి ఆలోచన ఉందా అని అడిగితే ఈ ప్రశ్న అడిగిన మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పెళ్లి అని ఆలోచన తనను ఎప్పటికీ ఆందోళనకు గురిచేస్తుంది అన్నట్లుగా రియాక్ట్ అయింది ఇలియానా. మరోపక్క ఈ హీరోయిన్ కి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రీసెంట్ గా ఓ బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా ఇలియానా మాట్లాడుతూ తనకు తన ఫ్యామిలీ మెంబర్స్ సంబంధాలు చూడడం ఆపడం లేదని..

తన మ్యారేజ్ పై తన ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకుందని చెప్పుకొచ్చింది. కానీ పెళ్లిపై ఇలియానా ఎందుకు ఆసక్తి చూపించడం లేదు అని అంశంపై మాత్రం ఆమె సరైన క్లారిటీ మాత్రం ఇవ్వలేక పోయింది. కాకపోతే గతంలో ఆమె పలువురితో ప్రేమాయణాలు నడిపి బాగా ఇబ్బందులు పడింది. ఎన్నో రకాల బాధలను అనుభవించింది. అందుకే ఏ ఒక్కరితోనూ తన ప్రేమను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది అనే బాధ ఆమెను డిప్రెషన్కు గురి చేస్తోందట. అందుకే ఇలియానా పెళ్లి పై అసలు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోని పలు సినిమాలు చేస్తుంది ఇలియానా. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: