బాలయ్య-చిరు సినిమాలకు శృతిహాసన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలిస్తే షాకే..!?

Anilkumar
ప్రస్తుతం సీనియర్ హీరోలకు జోడిగా నటించే హీరోయిన్స్ తక్కువైపోయారు. ఈ సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా పెద్ద కష్టంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలకు ప్రతి సినిమాల్లోనూ హీరోయిన్గా నటిస్తోంది శృతిహాసన్. గతంలో ఈమెది ఐరన్ లెగ్ అని చాలా రకాల వార్తలు రావడం జరిగింది. ప్రస్తుతం ఈమె నటించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈమె చాలా సినిమాలలో నటించి నప్పటికీ కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. 

ఇందుకు కారణం ఆమెకి ఉన్న స్టార్ ఇమేజ్. అయితే ప్రస్తుతం ఈమె ఇద్దరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన సినిమాలు ఒకేసారి సంక్రాంతి కానుకగా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా  కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా మరియు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాలో నటించింది ఈమె. వీరిద్దరి సినిమాలో ఈ ఇద్దరు హీరోలకి జోడిగా హీరోయిన్గా నటిస్తోంది శృతిహాసన్. ఈమె నటించిన ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవడం పక్క అని అంటున్నారు ఈమె అభిమానులు. ఇక ఈ రెండు సినిమాలను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం.

 ఇదిలా ఉంటే ఇక తాజాగా శృతిహాసన్ ఈ రెండు సినిమాలకు గాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం శృతిహాసన్ ఒక్క సినిమాకి గాను రెండు కోట్ల రూపాయలకు పైగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలకి కలిపి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ శృతిహాసన్ కి ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలి అంటే శృతిహాసన్ కి ఈ ఏడాది ఈ స్టార్ హీరోలతో బాగా కలిసి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ తో సలార్ సినిమాలో కూడా నటిస్తుంది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: