నాని కోసం ఆ స్టార్ హీరో ఆఫర్ ను వదులుకున్న మృణాల్ ఠాకూర్....!

murali krishna
మృణాల్ ఠాకూర్‌.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెరకు పరిచయమై న ఈ అమ్మడు. ఇక్కడ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది.
ప్రస్తుతం తెలుగు లో ఈ బ్యూటీ రెండో సినిమా కు కూడా సైన్ చేసింది. అదే నాని 30 సినిమా.ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

నాని కెరీర్ లో తెరకెక్కబోయే 30వ చిత్రం ఇది. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్ ఈ చిత్రాని కి దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తుంది.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల మరియు మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారని సమాచారం.తండ్రీకూతుళ్ల రిలేషన్‌ షిప్‌ నేపథ్యం లో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుంది.. ఇందులో నానీకి జోడీగా మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతోంది.
అయితే మృణాల్ కు సంబంధించి ఓ షాకింగ్ వార్త అయితే నెట్టింట బాగా వైరల్‌గా మారింది. అదేంటంటే.. నాని సినిమా కోసం మృణాల్ ఏకంగా ఎన్టీఆర్ కు  కూడా నో చెప్పిందట. అసలేం జరిగింంటే.. `ఎన్టీఆర్ 30`, `నాని 30` సినిమాల నుంచి ఒకేసారి మృణాల్ కు ఆఫర్ అయితే వచ్చిందట. అయితే ఈ రెండు చిత్రాల్లో నాని మూవీలోనే తన పాత్రకు ఎక్కువ వెయిట్ ఉంటుందని సమాచారం.ఎన్టీఆర్ మూవీలో కేవలం గ్లామర్ షో కు మాత్రమే అన్నట్లు హీరోయిన్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.ఈ కారణంగా నే నాని సినిమాకు సైన్ చేసి.. ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిందని జోరుగా టాక్ అయితే నడుస్తోంది. ఈ వార్త తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె పై కొద్దిగా ఘరం గా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: