మహేష్ మూవీలో ఆ హీరోయిన్ ని రాజమౌళి తీసుకోబోతున్నాడా..?

Pulgam Srinivas
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించిన రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా రాజమౌళి కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. 

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ ఈ మూవీ పై కేవలం తెలుగు సినీ ప్రేమికుల మాత్రమే కాకుండా ఇండియన్ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాజమౌళి ... మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా ఈ మూవీ లో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను హీరోయిన్ గా తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నాట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే మహేష్ బాబు మూవీ కోసం రాజమౌళి చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా రంగం లోకి దించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు ... త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన అందాల ముద్దు గుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: