బిగ్ బాస్ మూసేయాల్సిందే.. ఫినాలే టిఆర్పి రేటింగ్స్ ఎంతో తెలుసా?

praveen
తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ పంచడమే లక్ష్యంగా అటు ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది బిగ్ బాస్ కార్యక్రమం. అయితే మొదటి సీజన్ సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక తెలుగు బుల్లితెరపై కూడా బిగ్ బాస్ కార్యక్రమానికి తిరుగు ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత సీజన్ల నుంచి ఏదో తేడా కొట్టేసింది. క్రమక్రమంగా బిగ్ బాస్ కార్యక్రమానికి క్రేజ్ తగ్గిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేసినప్పటికీ సాదాసీదా షోలకు వచ్చిన రేటింగ్ కూడా సొంతం చేసుకోలేక పోతుంది.

 బిగ్బాస్ కార్యక్రమంలో ప్రతి సీజన్లో కూడా పాత టాస్కులను రిపీట్ చేస్తూ ఉండడం.. ఇక కంటెస్టెంట్లు కూడా పెద్దగా ఎంటర్టైన్మెంట్ పంచకపోవడంతో పనిగట్టుకొని ఈ కార్యక్రమాన్ని చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో మొన్నటికి మొన్న ముగిసిన బిగ్బాస్ ఆరవ సీజన్ ఒక పేలవ సీజన్ గానే ముగిసింది అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమం 100 రోజులపాటు సరైన రేటింగ్ సంపాదించకపోయినప్పటికీ ఇక గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. కానీ ఇటీవల జరిగిన బిగ్ బాస్ ఆరవ సీజన్ గ్రాండ్ ఫినాలే మాత్రం వీకెండ్ ఎపిసోడ్స్ కంటే రెండు మూడు పాయింట్స్ మాత్రమే ఎక్కువ టిఆర్పి తెచ్చుకోవడం గమనార్హం.

 ఐదవ సీజన్ తో పోల్చి చూస్తే చాలా తక్కువ టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంది అన్నది తెలుస్తుంది. ఒకప్పుడు బిగ్ బాస్ కార్యక్రమం పై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ మొదటి సీజన్ 14.2 టిఆర్పి సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత అన్ని సీజన్స్ కూడా 14 టి ఆర్ పి కంటే తక్కువే దక్కించుకున్నాయి. కానీ నాలుగవ సీజన్ మాత్రం 21.7 టిఆర్పి సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ప్రసారమైన బిగ్బాస్ ఆరవ సీజన్ గ్రాండ్ ఫినాలే టిఆర్పి రేటింగ్ మాత్రం పూర్తిగా తగ్గిపోయిందట. హీరోలను పిలిపించి సందడి చేసిన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది అన్నది తెలుస్తుంది. ఇక విన్నర్ ప్రైజ్ మనీలో 80% అంటే 40 లక్షలు తీసుకొని ఒకరు టైటిల్ రేస్ నుంచి తప్పుకోవచ్చు అని చెబితే ఆటలో మజా ఏముంటుంది. అందుకే గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. మొత్తంగా ఈ ఆరవ సీజన్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి కేవలం 6 టిఆర్పి మాత్రమే వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: