ఆ స్టార్ హీరో తో మల్టీస్టారర్ సినిమా చేయనున్న అల్లరి నరేష్..!?

Anilkumar
అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నాగార్జున కెరియర్ లో ఎన్నో యాక్షన్ త్రిల్లర్ సినిమాలలో నటించి మరి గుర్తింపును పొందాడు. అంతేకాదు  ఈయన నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అయ్యాయి. కానీ ఈమధ్య ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ఇటీవల ఆయన హీరోగా నటించిన బంగారు రాజు  సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ విజయాన్ని మాత్రం అందుకోవడంలో విఫలమయ్యాయి అని చెప్పాలి. 

దీనికిగాను ప్రస్తుతం నాగార్జున మాస్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదు అన్నట్లుగా తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సమయంలో గాడ్ ఫాదర్ సినిమా దర్శకుడు మోహన్ రాజా నాగార్జునతో ఒక సినిమా చేయాలి అని అనుకున్నారు. తీరా చూస్తే గాడ్ ఫాదర్ సినిమా అంతటి విజయాన్ని అందుకోలేకపోవడంతో నాగార్జున తో సినిమాని క్యాన్సల్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో నాగార్జున రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా మంచి విజయాన్ని అందుకుంటే

 ఈ సినిమా రైటర్ ప్రసన్నకుమార్ తో కలిసి ఒక సినిమా చేయాలని భావించారు నాగార్జున. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా హిట్ అవడంతో ధమాకా సినిమా రైటర్ తో నాగార్జున సినిమా చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అల్లరి నరేష్ మరియు నాగార్జున కాంబినేషన్లో రానున్న ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా అని ఫుల్ కామెడీతో ఈ సినిమా రాబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. మరి ఈ సినిమా అయినా వీరిద్దరికి మంచి కం బ్యాక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: