"వాల్తేరు వీరయ్య" సాంగ్స్ కి మామూలు రెస్పాన్స్ లేదుగా..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ...  మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి రవితేజ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ... దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ లో శృతి హాసన్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం 3 పాటలను విడుదల చేసింది. మొదటగా ఈ మూవీ నుండి ఈ మూవీ యూనిట్ బాస్ పార్టీ సాంగ్ ను విడుదల చేయగా ... ఆ తర్వాత శ్రీదేవి చిరంజీవి సాంగ్ ను ... ఆ తర్వాత వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది.

ఈ మూడు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ నుండి మొదట విడుదల చేసిన బాస్ పార్టీ సాంగ్ ఇప్పటివరకు యూట్యూబ్ లో 36 మిలియన్ న్యూస్ ను సాధించింది. అలాగే శ్రీదేవి చిరంజీవి సాంగ్ ఇప్పటివరకు 10 మిలియన్ వ్యూస్ ను సాధించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ 7.5 మిలియన్ న్యూస్ ను సాధించింది. ఇలా వాల్తేరు వీరయ్య మూవీ నుండి చిత్ర బంధం విడుదల చేసిన మూడు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: