హరీష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుస్సా..కారణం ఇదే?

Satvika
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువే..కొత్త సినిమాలు ఇంకా వస్తున్నాయా అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. దానికి తోడు ఆయన వరుస సినిమాలు హిట్ అవుతుండటంతో నెక్స్ట్ సినిమా ఎవరితో అనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఎక్కువ అవుతుంది. ఇకపోతే హరీశ్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తున్న సంగతి తెలిసిందే.అయితే హరీశ్ శంకర్ ముందు అనుకున్న 'భవదీయుడు భగత్ సింగ్' వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం మార్చి స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పి నట్లు గా ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి..

ఈ స్క్రిప్ట్ కోసం డైరెక్టర్ కాస్త టైం తీసుకున్నట్లు తెలుస్తుంది..ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఇంకా టైం కావాలి అనడం పై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.గతంలో హరీష్ రాసిన కథతో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... అలాంటి ఆయనకు డైరెక్షన్లో ఈ సినిమా రావాలని ఆయన ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది డైరెక్టర్ ఇప్పుడు ఆలస్యం చెయ్యడం పై పలువురు పెదవిరుస్తున్నారు. ఆయనకు ఇప్పుడు ఇష్టం లేదేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా వుండగా..డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హారి హర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా చాలా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇంకో షాకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా లేట్ అవుతున్న క్రమంలో గతంలో దిల్ రాజు కు హరీష్ ఒక కథ చెప్పారట. అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది అని అంటున్నారు..ఇకపోతే హరీశ్ మాత్రం తమిళ డైరెక్టర్ తమిళ హీరో శివకార్తికేయన్ తో దిల్ రాజు కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అన్నీ విని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసహనం తో వున్నారు..దీని పై మరో అప్డేట్ ఎప్పుడూ వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: