ధమాకా: వసూళ్లు మాములుగా లేవుగా?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో మహా రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో మాస్ రాజా మంచి మాస్ హిట్ ని  అందుకున్నాడు. త్రినాద రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవితేజ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ హాట్ బ్యూటీ అయిన శ్రీలీల హీరోయిన్ గా నటించి బాగా మెప్పించింది.పక్క మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ మూవీ. ఈ సినిమాని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ పిక్చర్స్' బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్ ఇంకా అలాగే ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ మూవీకి మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి.


వీకెండ్ ను సూపర్ గా క్యాష్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటిదాకా భారీ వసూళ్లనే. నిన్నటికి 20 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసిందని సమాచారం తెలుస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ధమాకా సినిమా 20 కోట్లకు పైగా దిమ్మతిరిగే కలెక్షన్స్ ను సాధించింది. ఇక సంక్రాంతి దాకా పెద్ద మూవీలు కేల పోవడంతో రానున్న రోజుల్లో ఈ మూవీ వసూళ్లు ఖచ్చితంగా మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక మాస్ రాజా రవితేజ నుంచి సరిగ్గా ఇలాంటి హిట్ కోసమే ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. క్రాక్ సినిమా తర్వాత రవితేజ ధమాకా వంటి మూవీతో హిట్ అందుకున్నారు. రవితేజ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇంకా అలాగే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు చేస్తున్నాడు మాస్ రాజా రవి తేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: