హిందీలో ఆ టైటిల్ తో వాల్తేరు వీరయ్య..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి ... తన అద్భుతమైన నటనతో ... అద్భుతమైన డ్యాన్స్ తో ... డైలాగ్ డేలవరి తో ... మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరోగా నటించాడు.

బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం మూడు పాటలను విడుదల చేయగా ... ఈ మూడు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఏ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రమోషన్ లను కూడా మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ విలేకరులతో ప్రెస్ మీట్ ను కూడా నిర్వహించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ని తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ లో కూడా ఈ మూవీ ని వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తోనే విడుదల చేయబోతున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: