నేను అందుకోసమే పుట్టా... సుమ..!

Pulgam Srinivas
టీవీ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సుమ ఇప్పటికే ఎన్నో బుల్లితెర టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. అలాగే సుమ ఎన్నో సినిమా ఆడియో ఫంక్షన్ లకు ... ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లకు మరియు ఇతర ఈవెంట్ లకు యాంకర్ గా వ్యవహరించి కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఇలా ఎక్కువ శాతం టీవీ ల ద్వారా ప్రేక్షకులను అలరించిన సుమ కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలోనూ  ఇతర పాత్రల లోనూ మరియు మరికొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలోనూ నటించిన సందర్భాలు ఉన్నాయి . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సుమ "జయమ్మ పంచాయతీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుమ యాంకరింగ్ ను వదిలేస్తున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై సుమ స్పందించింది ... ఈ మధ్య నేను న్యూ ఇయర్ ఈవెంట్ లో పాల్గొన్నాను. ఆ ఈవెంట్ లో భాగంగా నేను కాస్త ఎమోషనల్ అయినా మాట వాస్తవమే. అయితే మీరు కనుక ఈవెంట్ మొత్తం చూస్తే అసలు విషయం మీకే తెలుస్తుంది. నేను టీవీ కోసం మరియు ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టా ... నేను ఎక్కడికి కూడా వెళ్ళను. కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: