ఈరోజు ఆ సమయానికి చిరంజీవి... రవితేజ ప్రెస్ మీట్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రవితేజ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ... దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది  ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ యూనిటీ ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఇప్పటికే పలు ప్రచార చిత్రాలను మరియు మూడు పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య మూవీ లో హీరోగా నటించిన చిరంజీవి మరియు ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన రవితేజ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విలేకరుల ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మరియు రవితేజ వాల్తేరు వీరయ్య మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ,  బాబీ సింహ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడంతో ... ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: