ఏకంగా అంత శాతం "సలార్" షూటింగ్ పూర్తి..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సీరీస్ మూవీ ల ద్వారా ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అందులో భాగంగా బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మూవీ లలో ... అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ "కే జి ఎఫ్" మూవీకి దర్శకత్వం వహించినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , జగపతిబాబు , పృధ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. రవి బుస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి విజయ్ ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఈ మూవీ యొక్క షూటింగ్ 85% పూర్తి అయినట్లు ... మరో 15% షూటింగ్ ను జనవరిలో పూర్తి చేయనున్నట్లు , ఈ మూవీ యొక్క విఎఫ్ఎక్స్ పనులకు ఆరు నెలలు కేటాయించనున్నట్లు , అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు విజయ్ చెప్పుకొచ్చాడు. అలాగే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రషేస్ చూశాను అని ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు అని ఈయన పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: