టాలీవుడ్ లో విషాదం నటుడు చలపతిరావు మృతి..!!

Divya
ఈమధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం కృష్ణ, కృష్ణంరాజు మరణ వార్త మరువక ముందే మరొక నటుడు కైకాల సత్యనారాయణ రావు కూడా గడిచిన రెండు రోజుల క్రితం మరణించారు .ఇప్పుడు తాజాగా ఈ రోజున సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూయడం జరిగింది. ఈయన వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. ఇక ఈరోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఇండస్ట్రీలో పలు విషాదఛాయలు అలుముకుంటున్నాయి.

నటుడు చలపతిరావుకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారట. వీళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి పల్లెటూర్లకు వెళుతూ ఉంటారు .ఇలా ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు తన నటనతో అలరించిన సీనియర్ నటుడు చలపతిరావు ఎక్కువగా శని నటీనటుల సైతం బాబాయ్ ని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. మహానియుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పని చేసిన దిగ్గజ నటుడు చలపతిరావు ఇండస్ట్రీలో మంచి పేరున్న నటుడుగా పేరుపొందారు.
చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారిపోయిందని చెప్పవచ్చు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూడచారి సినిమాతో మొదటిసారిగా అయిన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపుగా 1200 పైగా చిత్రాలలో నటించి పలు పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన స్వస్థలం కృష్ణ జిల్లా పాముర మండలంలోని బల్లిపర్రు. 1944 మే 8వ తేదీన తండ్రి మణియ్య, తల్లి వీయమ్మ కు జన్మించారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు ఆయననే నటుడు రవిబాబు టాలీవుడ్ నటుడు దర్శకుడుగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖుల సైతం శోకసముద్రంలోకి మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: