'సలార్' నుండి అదిరిపోయే అప్డేట్..!!

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినందుకు గాను వచ్చే ఏడాది కనీసం ప్రభాస్ రెండు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ మరియు ఆది పురుష్ సినిమాలు చేస్తున్నాడు. కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హుంబాలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ బాధ్యతలను తీసుకుంది. ఇక ఈ సంస్థ అధినేత విజయ్  ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని తాజాగా ఇవ్వడం జరిగింది. 

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని ఆయన తెలియజేశాడు. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా ఈసారి కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే సత్తా ఈ సినిమాకి కచ్చితంగా ఉంది అని ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది అని జనవరి నెల ఆఖరిలోపు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అవుతుందని విఎఫ్ఎక్స్ కోసం మరో ఆరు నెలల సమయం పడుతుంది అని దీనికిగాను ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని ఆయన

 ఈ సినిమాకి సంబంధించిన ఒక క్లారిటీని ఇవ్వడంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. రాబోయే రోజుల్లో అన్ని భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుందని విజయ్ చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ సంస్థ తెలుగులో నిర్మిస్తున్న మొదటి సినిమా ప్రభాస్ సలార్ చిత్రమే కావడం గమనార్హం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .పాన్ ఇండియా  రేంజ్ లో విడుదలవుతున్న ఈ  సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: