నయనతార సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడానికి అసలు కారణం ఇదే..?

Anilkumar
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార గురించి మనందరికీ తెలిసిందే. ఎల్లప్పుడూ వృత్తిపరంగా , వ్యక్తిగతంగా కూడా ట్రెండింగ్ లో ఉంటుంది నయనతార. కెరియర్ మొదట్లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ సరైన హిట్ అందుకో లేకపోయిన నయనతార ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలకి పోటీగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఇన్ని సినిమాలలో నయనతార నటించినప్పటికీ ఎప్పుడూ కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మాత్రం నయనతార కనిపించదు.

 ఇక ఈమధ్య నయనతార నిర్మాతగా కూడా మారింది. అయితే తాజాగా కనెక్ట్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నయనతార ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో భాగంగా నయనతార మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ చరిత్రలో నా పేరు ఎప్పటికీ ఉండిపోవాలని ఎల్లప్పుడూ ఆ భగవంతుని కోరుకునేదాన్ని కానీ నా కోరిక నెరవేరలేదు అని ఆమె చెప్పకు వచ్చింది. దాంతోపాటు కెరియర్ మొదట్లో హీరోయిన్ పాత్రలకు ఆటలు పాటలు తప్పించి పెద్దగా అవకాశాలు ఉండేవి కాదని ఆమె చెప్పుకొచ్చింది.

కానీ నేను మాత్రం హీరోయిన్ ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో మాత్రమే నటించాలని ఎప్పటికీ కోరుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. సాధారణంగా ఇంటర్వ్యూలలో గాని లేదా సినిమాకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలలో గాని హీరోయిన్ లను ఎప్పుడు ఒక మూలన కూర్చోబెట్టేవారని అందుకే నేను ఎలాంటి సినిమా ప్రచార కార్యక్రమాలకి కూడా హాజరుకాను అని నయనతార చెప్పింది. అప్పటినుండే హీరోయిన్ల పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలని నేను ఎప్పుడూ ఆశిస్తూ ఉండేదాన్ని అని... మొత్తానికి ఇన్ని రోజులకి నేను అనుకున్నది జరిగింది అని అందుకే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను పాల్గొంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది నయనతార. దీంతో నయనతార చేసిన కామెంట్లు కాస్త వైర్లు అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: