నయనతార "కనెక్ట్" మూవీ డిజిటల్ పార్టనర్ లాక్..?

Pulgam Srinivas
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎం తోమంది సీనియర్ మరియు జూనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన హీరోయిన్ గ కెరియర్ ను కొనసాగించింది.
అలాగే నయనతార ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఒలకబోయడానికి కూడా ఏమాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ అందచందాలను ఆరబోస్తూ కూడా కుర్రకారును వేడెక్కించిన సందర్భాలు ఉన్నాయి. అలా తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం నయనతార తెలుగు కంటే కూడా తమిళ సినిమా లోనే ఎక్కువగా నటిస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా తమిళంలో రూపొందిన కనెక్ట్ అనే మూవీ లో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. తమిళంలో రూపొందిన ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీని డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లలో తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల చేయగా , ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ డిజిటల్ హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు ,  కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని నెట్ పిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై అశ్విన్ శరవణనన్ ఈ మూవీని తేరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: