శ్రీదేవి... చిరంజీవి సాంగ్ కు 24 గంటల్లో అద్భుతమైన రెస్పాన్స్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ పాత్ర ఈ మూవీలో దాదాపు 42 నిమిషాల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి రవితేజ కు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం బాస్ పార్టీ అనే సాంగ్ ను విడుదల చేసింది. ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి శ్రీదేవి ... చిరంజీవి అనే అద్భుతమైన డ్యూయెట్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కు విడుదలైన గంటల్లోనే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ లోని ఈ సాంగ్ ను విడుదల చేసిన 24 గంటల్లో ఈ సాంగ్ యూట్యూబ్ లో 6.16 మిలియన్ వ్యూస్ ,  160.3 కె లైక్ లు లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే వాల్తేరు వీరయ్య మూవీలోని శ్రీదేవి ... చిరంజీవి సాంగ్ కు ప్రేక్షకులం నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: