ఏకంగా అన్ని భాషల్లో సూర్య కొత్త సినిమా..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య తమిళం లో రూపొందిన గజినీ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ మూవీ తో సూర్య కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నుండి సూర్య తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేసి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే సూర్య తాజాగా కమల్ హాసన్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో రోలెక్స్ అనే ఒక చిన్న పాత్రలో నటించాడు. ఈ పాత్రతో పాన్ ఇండియా రేంజ్ లో సూర్య గుర్తింపును సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య ,  చిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దిశా పటాని , సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతుంది. యు వి క్రియేషన్స్ , ప్రమోద్ స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ ని ఏకంగా 10 భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ ను వచ్చే సంవత్సరం విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: