"ఓటిటి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అమలాపాల్ కొత్త మూవీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటీ మనులలో ఒకరు అయినటు వంటి అమలా పాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే అమలా పాల్ కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన నాయక్  , అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో మూవీ లలో హీరోయిన్ గా నటించి ఫుల్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. కాకపోతే ఆ తర్వాత మాత్రం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల సరసన అవకాశాలను దక్కించు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే అమలా పాల్ సినిమాcలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.

తాజాగా అమలా పాల్ "ది టీచర్" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. వివేక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి అమలా పాల్ ప్రధాన పాత్రలో తలకెక్కిన ది టీచర్ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: