ఆ మూవీ కి డెడ్ లైన్ పెట్టిన స్టార్ హీరో....!!

murali krishna
"రాధే శ్యామ్" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లలో ఒకటి ఓం రౌత్ దర్శకత్వం లో రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న "ఆది పురుష్" సినిమా కాగా మరొకటి కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్".
నిజానికి "ఆది పురుష్" సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కి సిద్ధం అవ్వాలి కానీ ఈ చిత్ర టీజర్ కు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. పైగా సినిమా అవుట్ పుట్ విషయంలో దర్శక నిర్మాతలు కొన్ని మార్పులు చేయా లని నిర్ణయించుకున్న కారణం గా సినిమాని కొంతకాలం వాయిదా వేశారు. జూన్లో ఈ సినిమా విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సినిమా వర్క్ పూర్తవడానికి జూన్ అయ్యేటట్లు ఉంది. మళ్లీ సినిమా ప్రమోషన్ల కోసం కూడా కొంత సమయం పడుతుంది.
రెండు కలిపి "సలార్" తో పాటు "ఆది పురుష్" క్లాష్ అయ్యే టట్లు అనిపిస్తోంది. కానీ ఈ రెండు సినిమాలకి మధ్య కొంచెం అయినా గ్యాప్ ఉండాలి. అందుకని ఈ "సలార్" సినిమాని ముందు గానే విడుదల చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తు న్నారట. అయితే ఇప్పటికే "సలార్" సినిమాని లాంగ్ వీకెండ్ వచ్చే లాగా సెప్టెంబర్ 28న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. ఒకవేళ "ఆది పురుష్" సినిమా కనక జూన్ లో విడుదల కాకపోతే "సలార్" సినిమా తర్వాతే "ఆది పురుష్" విడుదల అవ్వాలి. ఒకవేళ జూన్ కనుక దాటితే "ఆది పురుష్" సినిమా మరింత లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: