"అవతార్ 2" మూవీ "ఓటిటి" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి జేమ్స్ కామరన్ తాజాగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే జామ్స్ కెమరన్ కొంత కాలం క్రితం అవతార్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అందులో భాగంగా అవతార్ మూవీ ఇండియాలో కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ మూవీ కి ఇండియాలో కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. అలా అవతార్ మూవీ ఇండియా లో సూపర్ హిట్ విజయాన్ని సాధించడంతో ఇండియా ప్రేక్షకులు కూడా అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ నిన్న అనగా డిసెంబర్ 16 వ తేదీన అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇండియాలో కూడా డిసెంబర్ 16 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ ఇంగ్లీష్ మరియు హిందీ "ఓ టి టి" స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు , కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: