రికార్డులను బ్రేక్ చేసిన ట్రిపుల్ ఆర్..ఇప్పటిల్లో కష్టమే..

Satvika
తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌలి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్' బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం.. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ కథగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల ను కట్టపడేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషనల్ రికార్డు ను క్రియేట్ చేసింది. ఇంకా ఈ సినిమా గ్లోబల్‌ గా పలు అవార్డులు, రివార్డులు అందుకుంటూ సందడి చేస్తూనే ఉంది.

అయితే ఈ సినిమాను జపాన్ దేశంలో ఇటీవల భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ను అక్కడ ప్రమోట్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఆక్కడికి వెళ్లారు. కాగా ఈ సినిమా కు జపాన్ వాసులు పట్టం కడుతూ వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 55 రోజులు దాటినా, అక్కడ కళ్లు చెదిరే వసూళ్ల తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ జపాన్ దేశం లో ఏకంగా 450 మిలియన్ యెన్స్ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డు ను క్రియేట్ చేసింది. అంతేగాక ఈ సినిమా ను చూసేందుకు 2 లక్షల 71 ఫుట్ ఫాల్స్ నమోదైనట్లుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.

గత రెండు దశాబ్దాలుగా జపాన్ దేశంలో రజినీకాంత్ 'ముత్తు' సినిమా 400 మిలియన్ యెన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించి, బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆ రికార్డు ను తుడిచి పెట్టేసింది. ఇక ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ రికార్డు ను తిరగరాయడం కాదుకదా.. దాన్ని టచ్ చేయడం కూడా కష్టమే అంటున్నారు జపాన్‌లో ని ఇండియన్ మూవీ లవర్స్. మరి అక్కడ టోటల్ రన్‌ లో ఆర్ఆర్ఆర్ ఎలాంటి వసూళ్ల తో నిలుస్తుందో చూడాలి.. ఇక రాజమౌలి ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: