ఉపాసన కి సరోగసి ఐడియా ఇచ్చింది ఆ స్టార్ హీరోయినా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఆమెకి సంబంధించిన ఏ వార్తనైనా ఆమె సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆయన సోషల్ మీడియా వేదికగా ఉపాసన తల్లి కాబోతుంది అని శుభవార్తను వారి అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇక ఈ వార్త విన్న మెగా అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మెగా అభిమానులు ఈ వార్త కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వార్త అనంతరం మెగా కుటుంబంలో సైతం ఆనందం నెలకొంది. 

 ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఉపాసన ప్రెగ్నెన్సీ కి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఉపాసన సరోగసి పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతుంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు ఇప్పుడు ఉపాసనకు సరోగసి పద్ధతిని ఒక స్టార్ హీరోయిన్ సజెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు సమంత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఉపాసన మరియు సమంత ఎంత మంచి ఫ్రెండ్సు మనందరికీ తెలిసిందే. ఇక సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో ఉపాసన సమంతకు అండగా నిలబడింది.సమంత మెంటాలిటీ ఆమె ఎలాంటి మనిషి అన్నది ఉపాసనకి బాగా తెలుసు. అయితే వీళ్ళిద్దరూ గతంలో సరోగసి పద్ధతిపై పాజిటివ్గా మాట్లాడారు.

అయితే మొదటి నుండి నాచురల్ గా బిడ్డను కనాలి అనుకున్న ఉపాసన మైండ్ ని సమంత మొత్తంగా మార్చేసింది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ క్రమంలోనే బెస్ట్ ఫ్రెండ్ అయిన సమంత మాటను విన్న ఉపాసన సరోగసి పద్ధతికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది ఈ పద్ధతిలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్త తెలిసిన కొందరు మెగా అభిమానులు ఇంత చదువుకొని తెలివి లేకుండా ఎవరో చెప్పిన మాటలను పట్టించుకోని మైండ్ మార్చుకుంటుందా అని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఉపవాసన సరోగసి పద్ధతి ద్వారా తల్లి అవ్వాలనుకుంటే అది ఎప్పుడో చేయొచ్చు కదా అని కొందరు భావిస్తున్నారు. ఇక అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం అందులో ఎవరు ఆమెను నిందించడానికి లేదు. అయితే ఏదేమైనా మెగా ఫ్యామిలీ ఉపాసన సరోగసి పద్ధతిపై నోరు విప్పితే బావుంటుంది అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ వార్తలపై ఉపాసన నోరు విప్పి దాకా ఆమె సరోగసి పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిస్తుందా అన్న విషయం పై క్లారిటీ రాదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: