తెరపైకి మళ్లీ #Boycottpathaan.. అందుకేనా..?

Divya

సంజు సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  భారీ చిత్రాలను తెరకెక్కించి అంతకుమించి అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ఇటీవల సంజు సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం పఠాన్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఈ సినిమాని పరిగణించవచ్చు . దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. కానీ ఈ సినిమాలో దీపికను చూపించిన తీరు సినిమాను బాయ్కాట్ చేయాలి అనే విధంగా విమర్శలు వస్తూ ఉండడం గమనార్హం.

అయితే మొన్నటి వరకు#Boycottpathaan పేరుతో ఈ సినిమాను బాయ్కాట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.  అంతేకాదు ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ప్రేక్షకులలో కొన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటే.. మరికొన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి. ఆమె ఈ సినిమాలో పూర్తిస్థాయిలో బికినీ ప్రదర్శన చేయడంతో ఇలాంటి సినిమాలు సమాజానికి ఏం చెబుతాయి ?ఫ్యామిలీలు ఎలా చూస్తాయి? అంటూ బాగా వ్యతిరేకత మొదలయ్యింది. ఇదిలా ఉండగా మళ్లీ ఇప్పుడు తెరపైకి #Boycottpathaan ట్రెండు అవడం గమనార్హం.

ముఖ్యంగా దీపికా కాషాయపు రంగులో ఉండే బికినీ ధరించడంతో హిందువులు ఎంతగానో పవిత్రంగా భావించే ఈ కాషాయపు రంగుల్లో బికినీలు ధరించి హిందూ మతాన్ని అగౌరవపరచడమే అంటూ దీపికాపై కొన్ని వర్గాల వారు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.  నిజానికి కాషాయపు రంగుల్లో ఈమె బికిని ధరించడం ఇప్పుడు మరొక వివాదానికి తెరతీసింది.  కనీసం ఈ సినిమా నుంచి ఈ పాట తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలను ఇండియాలో తెరకెక్కించి ఎటువంటి ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్నారు దర్శకనిర్మాతలు?  అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: