రేపు ఆ సమయానికి విడుదల కానున్న "ధమాకా" ట్రైలర్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీ లీల రవితేజ సరసన హీరోయిన్ గ నటించగా , త్రినధ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను రేపు అనగా డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
 

ది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం 6:45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. రవితేజ ఈ మూవీ తో పాటు రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: