"నెట్ ఫిక్స్" లో ఈ సంవత్సరం అత్యధిక మంది చూసిన మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటికే ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అనేక సినిమాలు విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను సాధించిన 10 సినిమాలు ఏవో వాటి వివరాలను తెలుసుకుందాం.


ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సూర్యవంశీ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో తిరకెక్కిన గంగుబాయి ఖతియవాడి మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ సంవత్సరం 3 వ స్థానంలో నిలిచింది. బుల్ బుల్లయ్య 2 మూవీ ఈ సంవత్సరంలో 4 వ స్థానంలో నిలిచింది. తలపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ 5 వ స్థానంలో నిలిచింది. డార్లింగ్ మూవీ ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 6 వ స్థానంలో నిలిచింది. బడాయి దో సినిమా 7 వ స్థానంలో నిలిచింది. 83 ది ఫిలిం మూవీ 8 వ స్థానంలో నిలిచింది. నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 9 వ స్థానంలో నిలిచింది. జాదూగర్ సినిమా 10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: