కాంతార సినిమా క్లైమాక్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హృతిక్ రోషన్..!?

Anilkumar
ఇటీవల కన్నడ హీరో రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో సంచలనంగా మారారు. ఈ సినిమా విడుదల ముందు వరకు ఈయన కేవలం దర్శకుడిగా మరియు హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే తెలుసు. ఈయన కాంతారా సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన తర్వాత ఆ క్షణం నుండి పాన్ ఇండియా స్థాయిలో ఈయన పేరు మారుమ్రోగుతుంది. అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆయన హీరోగా నటించి మంచి గుర్తింపును పొందాడు. ఈ సినిమా కన్నడ భాషలో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఇతర భాషలలో కూడా 

ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాను అన్ని భాషలలో విడుదల చేసినప్పటికీ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది .ఈ సినిమా ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలను కూడా అందుకుంది. ఎంతోమంది ఈయన సినిమా తీసిన విధానం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు .అయితే తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సైతం ఈ సినిమా గురించి స్పందించాడు. అయితే ఈ సందర్భంగా రుతిక్ రోషన్ కాంతార సినిమా చూశానని

 సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఈ సినిమా చూసి తాను చాలా నేర్చుకున్నాను అని రిషబ్ శెట్టి ఈ సినిమాని తీసిన విధానం అసాధారణమని స్టోరీ డైరెక్షన్ ఇందులో ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ నాకు గూస్బమ్స్ తెప్పిచ్చిందని ఇలాంటి అద్భుతమైన సినిమాని తీసినందుకు చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ హృతిక్ రోషన్ సినిమా గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. దీంతో హృతిక్ రోషన్ కాంతార సినిమాపై చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: