సాయి పల్లవి మౌనంలో సమాధానం లేని ప్రశ్నలు !

Seetha Sailaja

దక్షిణ భారత సినిమా రంగంలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరు అని ఎవరైనా సర్వే చేస్తే మరొక ఆలోచన లేకుండా అందరు సాయి పల్లవి పేరు మాత్రమే చెపుతారు. అయితే ఈ నేచురల్ బ్యూటీకి ఈ సంవత్సరం పెద్దగా కలిసి వచ్చినట్లుగా కనిపించడంలేదు. ఈ సంవత్సరం ఆమె రానా తో కలిసి నటించిన ‘విరాటపర్వం’ మూవీలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి కానీ ఆసినిమా విజయవంతం కాలేదు.

అదేవిధంగా ఈ సంవత్సరం ఆమె నటించిన ‘గార్గి’ మూవీ కూడ తమిళంలో ఫెయిల్ అయింది. ఈమూవీని తెలుగులో డబ్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. గత సంవత్సరం ఆమె నటించిన ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు విజయవంతం కావడమే కాకుండా ఆమెకు నటిగా మంచి పేరును తీసుకు వచ్చాయి.

అయితే గత కొంతకాలంగా ఎంతోమంది దర్శకులు నిర్మాతలు ఆమెను కలవాలని అదేవిధంగా ఆమెకు తమ కథలు వినిపించాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె ఎవర్నీ కలవడానికి ఆశక్తి కనపరచడం లేదు అంటూ గాసిప్పులు చెన్నై మీడియాలో హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈమె ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తోంది అంటు మరికొందరు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి ఆమెకు ఇప్పుడు ఉన్న క్రేజ్ రీత్యా ఎన్ని సినిమాలు అయినా ఆమెకు వస్తాయి. అయితే తను నటించే సినిమాలో తన పాత్ర పూర్తిగా నచ్చినప్పుడు మాత్రమే ఆమె డేట్స్ ఇస్తుంది అంటారు.

మరికొందరైతే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలి అన్న నిర్ణయానికి వచ్చింది అని అంటున్నారు. అయితే ఇలాంటి నిర్ణయం ఆమె ఎందుకు తీసుకునే ఆలోచనలో ఉంది అంటూ ఆమె ఆరోగ్యంలో ఏమైనా తేడా వచ్చిందా అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా ఎప్పటికైనా తాను ఒక హాస్పటల్ పెట్టి డాక్టర్ గా సెటిల్ అవుతాను అని చెప్పిన నేపధ్యంలో ఆమె హాస్పటల్ కట్టె ఆలోచనలలో ఉందా అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు..ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: