అవతార్ పంచాయితితో తికమకపడుతున్న చిరంజీవి బాలకృష్ణ !

Seetha Sailaja
ఈవారం విడుదలకాబోతున్న ‘అవతార్ 2’ మ్యానియాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవుతోంది. భారతీయ ప్రాంతీయ భాషలు అన్నింటిలోను డబ్ చేసి విడుదల కాబోతున్న జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ను ధియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు సిద్ధపడుతూ ఉండటంతో ఈమూవీ టికెట్ 4వందల నుండి 12వందల వరకు ధియేటర్ల స్థాయిని బట్టి అమ్మడం జరుగుతూ ఉన్నా జనం పట్టించుకోకుండా టిక్కెట్స్ కోసం జనం క్యూ కడుతున్నారు.  

ప్రపంచ సినిమా చరిత్రలో ఈసినిమాకు ఏర్పడినంత మ్యానియా ఇప్పటివరకు ఏసినిమాకు ఏర్పడలేదు ఇండియాలో కూడా ఈవారం బాక్సాఫీస్ మొత్తాన్ని ‘అవతార్ 2’ షేక్ చేయబోతోంది. ఈసినిమాకు భయపడి దేశంలో మరే పెద్ద సినిమా విడుదల కావడంలేదు. ఇండియాలో అనేక ధియేటర్లు ఇప్పటికే ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసాయి.

అయితే తెలుగు రాష్ట్రాలలోని చిన్నపట్టణాలు పంచాయితీలలో ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు ఓపెన్ చేయకపోవడం వెనుక ఒక పంచాయితీ కారణం అంటున్నారు.  చాలా చోట్ల ‘అవతార్-2’ టికెట్లు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడానికి సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు ఎగ్జిబిటర్లకు మధ్య ఆదాయ పంపకాల్లో వాటాలు కుదరకపోవడమే కారణమని అంటున్నారు. డిస్నీ సంస్థ లోకల్ పార్ట్‌నర్స్‌తో కలిసి ఇండియాలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్న విషయంతెలిసిందే. ఈసినిమా కలక్షన్స్ లో తమకు ఎక్కువశాతం షేర్ కావాలని డిస్నీ సంస్థ డిమాండ్ చేయడమే కాకుండా ఈసినిమాను జనవరి 15 వరకు ఎట్టిపరిస్థితులలోను ధియేటర్ల నుండి తీయమని థియేటర్ యాజమాన్యాలు ఎగ్రిమెంట్ రాయాలని డిస్నీ సంస్థ డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

ఇలాంటి ఎగ్రిమెంట్ టైప్ 2 టైప్ 3 నగరాలలోని ధియేటర్లు డిస్నీ సంస్థకు వ్రాసి ఇస్తే దీనివల్ల సంక్రాంతి రేస్ కు విడుదలకాబోతున్న ‘వాల్టేర్ వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ సినిమాలకు ధియేటర్ల విషయంలో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే ఈరెండు సినిమాలకు విజయ్ ‘వారసుడు’ నుండి ధియేటర్ల విషయంలో సమస్యలు ఏర్పడటంతో ఇప్పుడు ‘అవతార్ 2’ తో కూడ సమస్యలు ఏర్పడితే ఈరెండు సినిమాల కలక్షన్స్ కు భారీగా గండిపడే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: