ఆన్ స్టాపబుల్ 2 : ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసిన ప్రభాస్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ నాటికి పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో కూడా ప్రభాస్ హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ తో పాటు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ లో కూడా ప్రభాస్ హీరో గా నటిస్తున్నాడు. ఇలా వరుస మూవీ షూటింగ్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు గెస్ట్ గ విచ్చేశాడు.

ఈ టాక్ షో లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ టాక్ షో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ప్రభాస్ , గోపీచంద్ ఎపిసోడ్ లకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా విడుదల చేసింది  ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ టాక్ షో లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో స్టార్ హీరో అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫోన్ కాల్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ మరియు రామ్ చరణ్ మధ్య ఫోన్ సంభాషణ చాలా ఆసక్తిగా ఉన్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: