నీలిరంగు చీరలో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న అనుపమ..!

Pulgam Srinivas
మోస్ట్ గార్జియస్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి , తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.
 

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అంది పుచ్చుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా అనుపమ పరమేశ్వరన్ , నిఖిల్ హీరో గా తరికెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
 

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ "18 పేజెస్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ సందర్భంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

ఈ ప్రెస్ మీట్ లో అనుపమ పరమేశ్వరన్ నీలి రంగులో ఉన్న చీరను కట్టుకొని , అందుకు తగిన నీలి రంగు లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: