విన్నర్ కు ప్రైజ్ మనీని పెంచెసిన బిగ్ బాస్..ఎంతంటే?

Satvika
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 షో ముగింపుకు వచ్చేసింది..21 కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్బాస్ 13 వారాలు పూర్తికాగా నేడు 14వ వారం కూడా పూర్తి కానుంది.ఇప్పటికే హౌజ్ లోంచి 13 మంది వెళ్లగా ప్రస్తుతం 7గురు మాత్రమే మిగిలి ఉన్నారు. శ్రీహన్, రేవంత్, రోహిత్, శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి, ఇనయాలు ప్రస్తుతం హౌజ్ లో ఉండగా వీరిలో నేటి ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అయి, ఎవరు ఫైనల్ కి వెళ్తారో చూడాలి.

బిగ్బాస్ ప్రైజ్మనీ ముందుగా 50 లక్షలు అని ఎప్పుడో ప్రకటించారు. కానీ గత వారం కంటెస్టెంట్స్ కి రకరకాల టాస్కులు ఇచ్చి అందులో ఓడిపోతే బిగ్బాస్ ప్రైజ్మనీలో అమౌంట్ తగ్గుతుందని, గెలిస్తే అమౌంట్ యాడ్ అవుతుందని చెప్పి ఆడించాడు. కంటెస్టెంట్స్ టాస్కులన్నీ పూర్తి చేయగా చివరికి 3 లక్షలు తగ్గి 47 లక్షల వద్ద ప్రైజ్మనీ నిలిచింది. ఇదే ఫైనల్ అని నాగార్జున చెప్పగా ప్రైజ్మనీ అమౌంట్ తగ్గిందని కంటెస్టెంట్స్ ఫీల్ అయ్యారు..

అయితే, నిన్న జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు నాగార్జున. మూడు సూట్ కేసులు పెట్టి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఆ సూట్ కేసులో ఉండే అమౌంట్ బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీకి యాడ్ అవుతుందని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా కలిసి ఓ సూట్ కేసుని సెలెక్ట్ చేయగా అందులో 3 లక్షలు ఉండటంతో ఆ 47 లక్షలకి ఈ అమౌంట్ ని జత చేర్చి బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీ 50 లక్షలు అని ప్రకటించాడు నాగార్జున..

కాగా, బిగ్‌బాస్ విన్నర్ 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు, 25 లక్షల విలువ చేసే 600 గజాల స్థలం, మారుతి సుజుకి బ్రెజ్జా కారు కూడా సొంతం చేసుకోనున్నట్టు ప్రకటించాడు నాగార్జున. దీంతో కంటెస్టెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. మరి ఇవన్నీ గెలుచుకునే ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి మరి..అందుతున్న సమాచారం ప్రకారం సింగర్ రేవంత్ విన్నర్ అని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: