ఆ పని చిరంజీవి... బాలకృష్ణ ను అవమానించడమే... సీనియర్ నిర్మాత..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం సంక్రాంతి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాలు కలిగి ఉన్న రెండు సినిమాలు , తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి రెండు సినిమాలు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి అజిత్ హీరో గా తెరకెక్కిన తునివు మూవీ ని జనవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇదే రోజున తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ హీరో గా తెరకెక్కిన వారసుడు మూవీbని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రోజు మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ని థియేటర్ లలో విడుదల చేయమన్నారు.

ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూడు మూవీ లలో వారసుడు మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. నిర్మాత దిల్ రాజు "వారసుడు" మూవీ కి ఎక్కువ థియేటర్ లను కేటాయించడం కోసం మన తెలుగు సినిమాలకు తక్కువ థియేటర్ లను కేటాయిస్తున్నాడు అని వార్తలు అనేక రోజులుగా వస్తున్నాయి. ఈ విషయం పై తాజాగా సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే చిరంజీవి మరియు బాలకృష్ణ మూవీ లకు థియేటర్ లకు ఎక్కువ సంఖ్యలో థియేటర్ లను ఇవ్వకపోవడం చాలా శోచనీయమని ఈ నిర్మాత చెప్పుకొచ్చాడు. ఇది ఇద్దరు అగ్ర హీరోలను చిత్ర పరిశ్రమ అపమానించడమే అని వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: