ఆ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "కాంతారా" హిందీ వర్షన్..!

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే కన్నడ భాషలో కాంతారా అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీ లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. మొదట కన్నడ భాషలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆ తర్వాత అక్టోబర్ 15 వ తేదీన తెలుగు భాషలో కూడా ఈ మూవీ ని విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఈ మూవీ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే కాంతారా మూవీ యూనిట్ హిందీ వర్షన్ ను మాత్రం ఇన్ని రోజుల వరకు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయలేదు. ఇది ఇలా ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 9 వ తేదీ నుండి కాంతారా మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. ఈ రోజు నుండి ఈ మూవీ ని నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో హిందీ వర్షన్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ మూవీ హిందీ వర్షన్ ను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: