టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న సెలబ్రిటీస్...!!

murali krishna
ఈ మధ్యకాలం లో సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాల ను మాత్రమే పరిగణ లోకి తీసుకునే వారు అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమ లో ఎన్నో మార్పులు వచ్చాయి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హవా తగ్గడమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ స్థాయి భారీ గా పెరిగి పోయిందని చెప్పాలి.
ఈ క్రమం లోనే ఎంతో మంది సెలబ్రిటీలు కూడా పాన్ ఇండియా స్థాయి లో ఎంతో మంచి ఆదరణ సంపాదించు కుంటున్నారు.
ఈ క్రమం లోనే ప్రతి ఏడాది ఐఎండిబి అత్య ధిక ఆదరణ పొందిన సెలబ్రిటీల జాబితా లను విడుదల చేస్తుంటారు. ఈ క్రమం లోనే ఈ ఏడాది ఐఎండిబి జాబితా లో టాప్ టెన్ లో చోటు సంపా దించుకున్న సెలబ్రిటీ ల జాబితా ను కూడా విడుదల చేశారు.ఈ జాబితా లో అత్యంత ఆద రణ పొందిన హీరో లలో కోలీవుడ్ హీరో ధనుష్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈయన టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీ లను సైతం వెనక్కి నెట్టి ఈ జాబితా లో మొదటి స్థానం లో ఉన్నారు.
మొదటి స్థానంలో ధనుష్ ఉండ గా రెండవ స్థానం లో అలియా భట్ మూడవ స్థానంలో ఐశ్వర్యారాయ్ నాలుగవ స్థానంలో రామ్ చరణ్, మిగిలిన తర్వాతి స్థానాలలో వరుస గా సమంత, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనీయర్ ఎన్టీరామారావు, అల్లు అర్జున్, యశ్ నిలిచారు. ఇలా టాప్ టెన్ లో ఆరుగురు సౌత్ ఇండియన్ సెలబ్రిటీ లు కావడం విశేషం. అందులో నూ నెంబర్ వన్ స్థానం లో సౌత్ హీరో కావడం తో దక్షిణాది సినీ ప్రేక్షకులు సెల బ్రిటీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: