బ్యాన్ పై కామెంట్స్ చేసిన రష్మిక..ఏమందంటే?

Satvika
గత కొన్ని రోజులుగా టాలివుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి వార్తలు వినిపిస్తున్నాయి.. రష్మిక మందన్నా ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మడుని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ చూశారా అని ప్రశ్నించగా.. లేదు చూడలేదు అంటూ బదులిచ్చింది. అయితే కాంతార తెరకెక్కించిన రిషబ్ శెట్టి దర్శకత్వంతోనే రష్మిక సినీ పరిశ్రమకు పరిచయమైంది. అయితే ఇప్పుడు ఫెమ్ రాగానే లైఫ్ ఇచ్చిన వ్యక్తి నే మర్చిపోతారా అని ఆమెను ప్రతి ఒక్కరూ దుమ్ము దులిపెసారు.ఇక కన్నడ ప్రజలు మాత్రం నోటికి ఎంత వస్తే అంత అనెసారు..కాంతార మూవీ పై ప్రభాస్, రజినీకాంత్ వంటి పక్క ఇండస్ట్రీ స్టార్స్ ప్రశంసలు చేస్తుంటే.. సొంత ఇండస్ట్రీ హీరోయిన్ అయిన రష్మిక చూడలేదు అని కామెంట్స్ చేయడంతో వివాదం రాచుకుంది. దీంతో రష్మికను కన్నడ సినిమా నుంచి బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో నినాదాలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఆమెను మీడియా విలేకర్లు ప్రశ్నించగా, ఆమె బదులిచ్చింది.“కన్నడ చిత్ర పరిశ్రమ నాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కాంతార చిత్ర విషయం లో నాపై కొంతమంది అత్యుత్సాహం చూపించారు. విడుదల సమయంలో సినిమా చూడలేక పోయా, ఆ తరువాత చూసి చిత్ర బృందానికి మెసేజ్ కూడా పెట్టాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుం దో ప్రపంచానికి తెలియదు. ప్రొఫెషన్ పరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం నా బాధ్యత. అంతేగాని నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను” అంటూ వెల్లడించింది.. ఇది కాస్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది..  ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా లో నటిస్తుంది.. గతంలో పుష్ప ఎంత ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే.. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: