టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం కమిట్ అయిన మూవీల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు వరస మూవీలతో ఫుల్ జోష్ ని చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏ ఏ దర్శకులతో సినిమాలు చేస్తున్నారో ... ఏ ఏ దర్శకుల తో సినిమాలకు కమిట్ అయి ఉన్నారు తెలుసుకుందాం .
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే పాన్ వరల్డ్ మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. అలాగే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో కూడా హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ కి కమిట్ అయి ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్నాడు.

ఈ మూవీతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ కి కమిటీ అయి ఉన్నాడు. అలాగే సుజిత్ దర్శకత్వంలో కూడా ఒక మూవీలో నటించబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో నటించబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో నటించబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తేరకేక్కబోయే మూవీలో నటించబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో నటించనున్నాడు. అల్లు అర్జున్ మరికొన్ని రోజుల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పుష్ప పార్ట్ 2 మూవీలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: