మహేష్ బాబు ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తికాగా రెండవ షెడ్యూల్ ప్రారంభించాలి అన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరియు మ్యూజిక్ సెట్టింగ్స్ ని ముంబైలో మొదలుపెట్టడం జరిగిందట

 తాజాగా త్రివిక్రమ్ మరియు తమన్ ఇద్దరూ ముంబైలో మహేష్ ని కలిసి ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ గురించి చెప్పడం జరిగిందట. ఈ క్రమంలోనే వీరందరూ కలిసి డిన్నర్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోలు చూసిన అభిమానులు తెగ భయపడుతున్నారు. ఈ సినిమాలో వారందరితోపాటు మోహన్ రమేష్ కూడా ఉన్నాడు. దీంతో మహేష్ అభిమానులు మహేష్ మోహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడా అంటూ ఆలోచిస్తున్నారు. దీని గురించి సంబంధించిన

 వార్తలు అయితే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఏమీ రాలేదు. అయితే ఇక ఇప్పుడు మోహర్ రమేష్ మరియు మహేష్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న అనే కన్ఫ్యూజన్లో పడ్డారు మహేష్ అభిమానులు. అయితే మెహర్ రమేష్ మాత్రం మహేష్ బాబుకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా మహేష్ వెంటే ఉన్నాడు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన సమయంలో కూడా ఈయన మహేష్ కు తోడుగా నిలబడ్డాడు. అయితే వీరి మంచి స్నేహం కారణంగానే వీరిద్దరూ డిన్నర్ లో కలిసి ఉంటారని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: