సమంత ఆలస్యాన్ని కీర్తి శెట్టి సరిచేయగలదా!?

Seetha Sailaja
విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో ప్రారంభం అయిన ‘ఖుషీ’ మూవీ షూటింగ్ 40 శాతం వరకు పూర్తి అయింది అని అంటున్నారు. సమంతకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటే ఈ నెలలో ఈమూవీ విడుదల కావలసి ఉంది. సమంత తన అనారోగ్యం నుండి ఎప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్ లకు రాగలుగుతుంది అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోవడంతో ‘ఖుషీ’ షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న విషయమై ఆమూవీ నిర్మాతలకు కూడ క్లారిటీ లేదు అని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి సంబంధించిన ఒక షాకింగ్ గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈమూవీ కథలో కొన్ని మార్పులు చేస్తున్నారని ఆమార్పులకు అనుగుణంగా ఈ మూవీలో హీరో పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండకు ఒక సెకండ్ హీరోయిన్ పాత్రను క్రియేట్ చేసి కథలో మార్పులు చేస్తారని టాక్.

అంతేకాదు ఆ సెకండ్ హీరోయిన్ పాత్రకు కృతి శెట్టి తో చర్చలు జరుపుతున్నారని ఆమె అంగీకరిస్తే త్వరలో ఈమూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఈలోపున సమంత తన అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత మళ్ళీ ఆమె పై చిత్రీకరించవలసిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా విజయ్ దేవరకొండ పక్కన కీర్తి ఎంపిక అయింది అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది.

కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సమంత కేరళలోని ఒక ప్రముఖ ఆయుర్వేద హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సమంత పిఆర్ సిబ్బంది ఖండిస్తున్నారు. ఆమె తన ఇంటి దగ్గరనే వైద్యం చేయించుకుంటూ కోలుకుంటున్నట్లు ఆమె త్వరలోనే షూటింగ్ కు వస్తుందని అంటున్నారు. వాస్తవానికి ఈ వార్తలకు తెర పడాలి అంటే తిరిగి సమంత తన సినిమాల షూటింగ్ లు మొదలుపెట్టే వరకు ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: