"పుష్ప 2" మూవీ ని ఏకంగా అన్ని దేశాల్లో విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్న మూవీ యూనిట్..?

Pulgam Srinivas
ఐ కాన్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప పార్ట్ 1 మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సునీల్ , అనసూయ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ లో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటించాడు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో రష్యా లో కూడా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పుష్ప మూవీ యూనిట్ రష్యా లో ఈ మూవీ ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు పుష్ప పార్ట్ 2 మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగినట్టు గానే ఈ మూవీ యూనిట్ కూడా ఈ సినిమాను పుష్ప పార్ట్ 1 కు మించిన స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని పుష్ప పార్ట్ 1 కు మించిన స్థాయిలో విడుదల చేయడానికి కూడా ఈ మూవీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పుష్ప పార్ట్ 2 మూవీ ని 20 కి పైగా దేశాలలో విడుదల చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: