వరుస పాన్ ఇండియా మూవీ లతో చెలరేగిపోనున్న రామ్ చరణ్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అంజలి , సునీల్ ఏ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా , ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ న్యూజిలాండ్ లో భారీ బడ్జెట్ తో ఒక సాంగ్ ను చిత్రీకరించింది. అలాగే న్యూజిలాండ్ లో కొన్ని సన్నివేశాలను కూడా ఈ మూవీ యూనిట్ చిత్రీకరించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఉప్పెన మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక మూవీ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందించ బోతున్నారు. ఇలా ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా మూవీ లను కమిట్ అవుతూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: