నయనతార "కనెక్ట్" మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయన తార ప్రస్తుతం వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లలో నటించిన నయన తార ప్రస్తుతం మాత్రం తెలుగు లో ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. ప్రస్తుతం నయన తార ఎక్కువ శాతం తమిళ మూవీ లలో నటిస్తోంది. తమిళ్ లో కూడా నయన తార చాలా వరకు కమర్షియల్ మూవీ లలో కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే నయన తార అనేక లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నయన తార "కనెక్ట్" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని యువి క్రియేషన్ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్ 9 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిటీ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: