తాప్సి: ఆ సినిమా పైనే అన్ని ఆశలు?

Purushottham Vinay
కరోనా మహమ్మారి ముందు వరకు కూడా మంచి ఫామ్‌లో కనిపించిన తాప్సీ  కోవిడ్ తరువాత మాత్రం కెరీర్‌ విషయంలో చాలా తడబడుతున్నది.ఈ హాట్ బ్యూటీ నటించిన సినిమాలు చాలా వరకు కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఒకటి రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా కానీ అవి పెద్దగా వర్కవుట్ కావటం లేదు. దీంతో తాప్సీ కెరీర్‌ క్లైమాక్స్‌కు వచ్చినట్టేనా అన్న డిస్కషన్ ఇప్పుడు మొదలైంది.కరోనా మహమ్మారికి ముందు బద్ల, మిషన్ మంగల్‌ ఇంకా తప్పడ్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించింది తాప్సీ. కరోనా మహమ్మారి టైమ్‌లో థియేటర్లకు బ్రేక్ పడటంతో హసీన్‌ దిల్రుబా చిత్రంతో డిజటల్‌ ఆడియన్స్‌ ముందుకు వచ్చి సక్సెస్ సాధించింది. ఓటీటీలో రిలీజ్ అయినా.. ఈ సినిమాకు యునానిమస్‌ పాజిటివ్‌ టాక్ రావటంతో అమ్మడి కెరీర్‌ అయితే ఫుల్‌ జోష్‌లో కనిపించింది.ఇక అదే జోరులో రష్మిరాకెట్‌ ఇంకా లూప్‌ లపెట్టా లాంటి డిఫరెంట్ చిత్రాలు చేసింది తాప్సీ. కానీ ఆ సినిమాలేవి కూడా అనుకన్న స్థాయిలో మెప్పించలేకపోవటంతో తాప్సీ కెరీర్‌ అనేది దెబ్బకి గాడి తప్పింది.


ఆ తరువాత మిషన్ ఇంపాజిబుల్‌ ఇంకా శభాస్‌ మిథు లాంటి చిత్రాలు థియేటర్లలోనే విడుదల అయినా… అవి కూడా సరిగ్గా విజయాలు సాధించలేకపోయాయి. రీసెంట్‌గా తడ్కా చిత్రంతో మరోసారి డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు వచ్చింది తాప్సీ పన్ను. ఈ చిత్రం కూడా అమ్మడి కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయింది. దీంతో ఆమె ఆశలన్ని కూడా రాబోయే మూవీ బ్లర్ మీదే ఉన్నాయి.ఇక తాప్సీ కెరీర్‌కు బ్లర్ సక్సెస్‌ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్‌. ఈ చిత్రంలో కళ్లు సరిగా కనిపించని అమ్మాయిగా చాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నది తాప్సి. అంతేకాదు ఈ చిత్రంతో తాప్సీ నిర్మాతగా కూడా మారడం జరిగింది. ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యింది తాప్సీ. ఈ సినిమాని థియేటర్‌లో రిలీజ్‌ చేసి రిస్క్ చేయటం కన్నా.. ఓటీటీలో రిలీజ్ చేయటం చాలా సేఫ్‌ అని ఫీల్ అవుతున్నారు. మరి ఇక ఈ నిర్ణయం తాప్సీ కెరీర్‌ను గాడిలో పెడుతుందా..? లేదా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: