"కాంతారా" హిందీ వర్షన్ "ఓటిటి" విడుదల వచ్చేసింది..!

Pulgam Srinivas
కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రిషబ్ శెట్టి తాజాగా కాంతారా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మొదట కన్నడ భాషలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ని తెలుగు భాషలో విడుదల చేశారు. తెలుగు భాషలో కూడా ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కాకపోతే ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ మాత్రం ఇప్పటికి ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావడం లేదు. తాజాగా కాంతారా మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" స్ట్రీమింగ్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. కాంతారా మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ "ఓ టి టి" సంస్థ ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ను డిసెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: