చాలా కాలం తర్వాత కలవబోతున్న ప్రభాస్ - త్రిష.. ఎందుకో తెలుసా..?

Anilkumar
పాన్ ఇండియా  స్టార్ హీరో ప్రభాస్ మరియు త్రిష కలిసి వర్షం, పౌర్ణమి, బుజ్జి గాడు వంటి సినిమాలలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాల్లో  ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు .వీరి సరసన మూడు సినిమాల్లో నటించడం వల్ల చాలామంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నారు .ఇక ఆ వార్తకు తగ్గట్టే వీళ్ళిద్దరి విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారాయి. దాంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని త్వరలో ఎంగేజ్మెంట్ డేట్ కూడా చెబుతారు అంటూ అనేక రకమైన వార్తలు సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం జరిగింది. అదే టైంకి త్రిష రానా తో క్లోజ్ గా ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని ప్రభాస్ కాస్త త్రిష కు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఇక అప్పటినుండి ప్రభాస్ త్రిష పెళ్లి మ్యాటర్ అక్కడితో అయిపోవడం జరిగింది. ఇక అప్పట్లో వీరి అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా బావుంటుంది అని అభిప్రాయపడ్డారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ తో మళ్ళీ త్రిష స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ వార్త జోరుగా వినిపిస్తోంది .అయితే ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అన్న సంగతి తెలిసింది కదా. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండవ షెడ్యూల్ కూడా మొదలు పెట్టనున్నారు .ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారట .

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో త్రిష కూడా ఉండబోతుంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా కదా వైరల్ గా మారాయి. అయితే హీరోయిన్ గా కాకుండా త్రిష ఒక గెస్ట్ పాత్రలో కనిపించిన ఉందట. అంతేకాదు కేవలం ఐదు నిమిషాలే ప్రభాస్ పక్కన ఈమె కనిపించనుందట .అంతేకాకుండా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ త్రిష అని మరి కొందరు అంటున్నారు ఈ విషయం తెలిసిన కొందరు నెటిషన్  లు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పాత ప్రేమికులు కలవబోతున్నారు అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం వీరు మళ్ళీ తమ పాత ప్రేమను గుర్తు తెచ్చుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటారా అన్నది చూడాలి అంటున్నారు ..ఈ విషయంపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: