కేవలం ఆయన కోసమే వీరసింహారెడ్డి మూవీలో విలన్ గా నటిస్తున్న... దునియా విజయ్..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్న దునియా విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తనకెక్కుతున్న ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడడం తో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను కూడా ఈ మూవీ యూనిటీ ఇప్పటికే విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మరియు పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే దునియా విజయ్ "వీర సింహా రెడ్డి' మూవీ లో విలన్ పాత్రలో నటించడం గురించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దునియా విజయ్ మాట్లాడుతూ ... బాలకృష్ణ కోసమే వీర సింహా రెడ్డి మూవీ లో విలన్ గా నటిస్తున్న ,  బాలకృష్ణ నాకు దేవుడిచ్చిన అన్నయ్య.  వీర సింహా రెడ్డి మూవీ షూటింగ్ లో బాలయ్య తో నేను పంచుకున్న అనుభవం మాటల్లో చెప్పలేను అని దునియా విజయ్ తాజాగా బాలకృష్ణ పై తనకు ఉన్న అభిమానాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: