ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ పై మరో కన్ఫ్యూజన్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో  ప్రభాస్ బాహుబలి అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఎనౌన్స్ చేశాడు కానీ ఆ సినిమాలేవి కూడా అంచనాలను అందుకోవడం లేదు.ఇక  విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేస్తున్నప్పటికీ విడుదల తర్వాత మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి.ఇటీవల ఆదిపురుష్ సినిమా అయితే మరి దారుణంగా ట్రైలర్ తోనే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఇక సరికొత్త టెక్నాలజీతో దర్శకుడు సినిమాలో తెరపైకి వస్తాడు అనుకుంటే చిన్నపిల్లల తరహా కార్టూన్ గ్రాఫిక్స్ తో షాక్ ఇచ్చాడు అని ఫ్యాన్స్ అందరు కూడా అప్సెట్ అయ్యారు.

ఇక సినిమాపై ఊహించని స్థాయిలో ట్రోలింగ్ కూడా నడిచింది.  వెంటనే ప్రభాస్ జోక్యం చేసుకొని సినిమాకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ లో చాలా మార్పులు చేయాలి అని డిసైడ్ అయ్యారు. సినిమాలో గ్రాఫిక్స్ లో చాలా మార్పులు చేయాలి అని మరికొంత సమయం కూడా తీసుకున్నారు. అందుకేఇక  జనవరికి రావాల్సిన ఈ సినిమాను 2023 సమ్మర్ కు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం ఆదిపురుష్ సినిమా ఆ సమయానికి కూడా రాకపోవచ్చు అని తెలుస్తోంది.మరికొన్ని సన్నివేశాలు రీశుట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలుస్తోంది.

అయితే  దర్శకుడు మారుతి సినిమాను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో కాస్త సీరియస్గా ఆలోచించి మళ్లీ మరికొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇక  అదే జరిగితే సినిమా మళ్ళీ 2024లో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. సలార్ సినిమాతో పాటు మారుతి సినిమా కూడా వచ్చి ఏడాదిలోనే విడుదల చేస్తారు. కాబట్టి ఇక  వెంట వెంటనే సినిమాలు విడుదలయితే బాగుండదు అని అందుకే ఆదిపురుష్ సినిమాను కొంత ఆలస్యంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.అయితే  మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: