శ్రీ లీల ప్రవర్తనకు తల పట్టుకుంటున్న నిర్మాతలు...!!

murali krishna
ప్రతి సంవత్సరం మన టాలీవుడ్ కి కొత్త హీరోయిన్లు అయితే పుట్టుకొస్తూనే ఉంటారు..ఎదో ఒక సినిమాతో బాగా లైం లైట్ లోకి వచ్చి ఆ తర్వాత వరుసగా రెండు ఫ్లాప్స్ పడితే కనుక కనుమరుగైపోతారు..గడిచిన ఐదేళ్ళలో అలాంటి హీరోయిన్స్ ని ఎంతో మందిని మనం చూసుంటాము..కానీ కొంతమంది హీరోయిన్స్ ని చూడగానే వీళ్ళకి ఇండస్ట్రీ లో కెరీర్ లైఫ్ స్పాన్ ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అని అయితే అనిపిస్తుంది..ఆ కోవకి చెందుతున్న కుర్ర హీరోయిన్ శ్రీ లీల.
శ్రీకాంత్ కొడుకు హీరో గా నటించిన పెళ్లిసందడి అనే చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైనా ఈ కన్నడ బ్యూటీ తొలిసినిమా తోనే ప్రేక్షకుల అందరి మనసుని దోచేసింది..అందం తో పాటు అద్భుతమైన అభినయం..దానికి తోడు మైమరపించే డాన్స్ చూసి ఎవరీ ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది..ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తుంది అని చూసే ప్రతి ప్రేక్షకుడికి కూడా అనిపించింది..అందుకే శ్రీలీల కి ఇప్పుడు అవకాశాల వెల్లువ కురుస్తుంది..స్టార్ హీరోలు సైతం ఈమె కాల్ షీట్స్ కోసం తెగ ఎగబడుతున్నారు.
రీసెంట్ గా ఈమెకి సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ అవకాశం అయితే వచ్చింది..ఈ పాత్ర కోసం ఆమెకి కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నారట..ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే..ఇక నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమాలో బాలయ్య బాబు కి కూతురు గా నటించే అవకాశం ని కొట్టేసింది శ్రీలీల..ఈ పాత్ర కోసం కూడా ఆమె కోటి రూపాయిలు డిమాండ్ అయితే చేసినట్టు తెలుస్తుంది.
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా సరే కోటి రూపాయిల పారితోషికం ఇస్తేనే సినిమా అగ్రిమెంట్ మీద సంతకం చేస్తాను అంటూ తెగేసి చెప్తుందట శ్రీ లీల పాప...దీనితో నిర్మాతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట..అయితే శ్రీ లీల కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడం తో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి అయితే ముందుకొస్తున్నారట..ఆమె చేతిలో ఉన్న సినిమాలలో ఒక్కటి హిట్టైన తన పారితోషికం ని రెండు నుండి మూడు కోట్ల రూపాయలకు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారట విశ్లేషకులు.
ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన 'ధమాకా' చిత్రం వచ్చే నెల 23 వ తారీఖున విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది..ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న విషయం.తెలిసిందే..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ కూడా వచ్చింది..ఈ చిత్రం హిట్ అయితే శ్రీలీల ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: