మారుతి మూవీలో ప్రభాస్ తో ఆడిపాడనున్న ముగ్గురు హీరోయిన్లు వీరే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తేరకేక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఎలాంటి హడా విడి లేకుండా ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ హర్రర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కనున్నట్లు , ఈ మూవీ కి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఒకే సెట్ లో జరగనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలాగే ఈ మూవీ ని దర్శకుడు మారుతి చాలా తొందరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మారుతి , ప్రభాస్ కోసం రాసుకున్న కథలో ముగ్గురు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మారుతి ఇప్పటికే ఆ ముగ్గురు హీరోయిన్ లను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రభాస్ సరసన ఈ మూవీ లో నిది అగర్వాల్ ,  మాళవిక మోహన్ , రిద్ధి కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

ఈ ముగ్గురికి కూడా ఇది క్రేజీ అవకాశం అని చెప్పవచ్చు. ఒక వేళ ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లు అయితే ఈ ముగ్గురు హీరోయిన్ లకు అమాంతం పన్ ఇండియా రేంజ్ క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూ లో మారుతి , ప్రభాస్ తో బుజ్జిగాడు , డార్లింగ్ లాంటి మూవీ తీయాలని ఉంది అని చెప్పడంతో ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: